చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి, 12మంది మృతికి కారణమిదే

చిత్తూరు జిల్లా మొగలిఘాట్‌ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతులకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామం మర్రిమాకుల పల్లెకు

  • Publish Date - November 9, 2019 / 11:55 AM IST

చిత్తూరు జిల్లా మొగలిఘాట్‌ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతులకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామం మర్రిమాకుల పల్లెకు

చిత్తూరు జిల్లా మొగలిఘాట్‌ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతులకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామం మర్రిమాకుల పల్లెకు తరలించారు. ప్రమాదానికి ప్రధానంగా డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణంగా పోలీసులు నిర్ధారించారు. కంటైనర్‌ బ్రేక్‌ ఫెయిల్‌ కాలేదని, ఇంజిన్‌ ఆఫ్‌ చేసి అతివేగంతో ఘాట్‌ దిగువ మార్గంలో వెళ్లడం వల్ల అదుపు తప్పినట్లు పోలీసులు తెలిపారు.

మొగలి ఘాట్‌లో శుక్రవారం(నవంబర్ 8,2019) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి కంటైనర్‌ యజమాని అక్షయ్‌కు డ్రైవింగ్‌లో అనుభవం లేకపోవడమేనని తెలుస్తోంది. డ్యూటీకి రావాల్సిన డ్రైవర్‌ సెలవులో ఉండటంతో అక్షయ్‌ డ్రైవింగ్‌ చేసి 12 మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. కంటైనర్ యజమాని అజయ్‌ది విజయవాడ. డ్రైవర్ సెలవు పెట్టడంతో.. అజయ్‌ కంటైనర్‌ వాహనాన్ని నడిపాడు. బెంగళూరు నుంచి విజయవాడకు.. వాటర్ బాటిల్‌ లోడ్‌తో బయలుదేరాడు.

మొగలిఘాట్‌కు చేరుకున్న తర్వాత బ్రేకులు పడకపోవడంతో… అక్షయ్‌.. కంటైనర్‌ క్లీనర్‌ రాజేశ్‌.. వాహనంలో నుంచి కిందకు దూకేశారు. క్షణాల్లో కంటైనర్‌.. డివైడర్‌ను ఢీకొట్టి.. ఎదురుగా వస్తున్న మూడు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఓ ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్‌ నుజ్జునుజ్జు అయ్యాయి. ఓమిని వ్యాన్‌లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, బైక్ పై ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 

కంటైనర్ వ్యాన్‌పై బోల్తాపడింది. అదే సమయంలో పలమనేరుకు బైక్‌ పై వెళ్తున్న నరేంద్ర పైకి కూడా వెళ్లింది. ఓమ్నీ వ్యాన్‌లో నుంచి పెట్రోల్ లీక్ కావడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.