టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) యాక్సిడెంట్ వార్త కలకలం రేపింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) యాక్సిడెంట్ వార్త కలకలం రేపింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రాజశేఖర్ క్షేమంగా బయటపడ్డారు. అయితే యాక్సిడెంట్ లో కారు నుజ్జునుజ్జు అయ్యింది. గుర్తు పట్టలేని రీతిలో కారుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది మిస్టరీగా మారింది.
కారులో మద్యం బాటిళ్లు కనిపించాయి. అదే సమయంలో కారు వేగం 150 కిమీ ఉంది. దీంతో కారు ప్రమాదానికి మద్యం మత్తు కారణమా లేక ఓవర్ స్పీడా అనేది తేలాల్సి ఉంది. ఈ కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ యాక్సిడెంట్ జరిగింది. 2017 అక్టోబర్ 9న రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ రోజు రాత్రి పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని.. తన కారుతో ఢీకొట్టారు రాజశేఖర్. ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశారని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా.. మద్యం తీసుకోలేదని తేలింది. తల్లి చనిపోయిందనే డిప్రెషన్‌లో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల మత్తు వచ్చిందని.. ఆ మత్తులో కారు యాక్సిడెంట్ చేశారని అన్నారు. గరుడవేగ
సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఈ యాక్సిడెంట్ జరిగింది.
కాగా రాజశేఖర్ చాలా వేగంగా డ్రైవ్ చేస్తారని తెలుస్తోంది. రోడ్డుపై ఓవర్ స్పీడ్ తో వాహనాలు నడుపుతారని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఓవర్ స్పీడ్ చలాన్లే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే రాజశేఖర్ వాహనంపై మూడు ఓవర్ స్పీడ్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.