Uttar Pradesh: యూపీలో అమానవీయ ఉన్మాదం.. 5 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన సాధువు
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ త్రిగుణ్ బిసెన్ మాట్లాడుతూ ఠానా గోవర్ధన్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిని బాబా హత్య చేశారని తెలిపారు. బాబాను అతని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
- tony bekkal
- Published On : August 20, 2023 / 05:46 PM IST
Madhura in UP: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఉన్మాదం చోటు చేసుకుంది. మథురలోని గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధా కుండ్ సమీపంలో పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం.. అది కూడా జనాలతో రద్దీగా ఉన్న రోడ్డులో ఐదేళ్ల చిన్నారిని ఒక సాధువు అతి కిరాతకంగా చంపాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి వద్దకు వెళ్లి.. అతడిని భుజాలపైకి ఎత్తుకుని నేలకేసి అత్యంత దుర్మార్గంగా బాదాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు ఆ సన్యాసిని విపరీతంగా కొట్టారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Russia Luna25: జాబిలిని అందుకోలేకపోయిన రష్యా.. కుప్పకూలిన లూనా-25.. ఇక చంద్రయాన్-3?
ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవర్ధన్ ప్రాంతంలోని రాధా కుండ్ కమ్యూనిటీ సెంటర్ సమీపంలో ఐదేళ్ల చిన్నారి అంకిత్ తన ఇంటి బయట ఆడుకుంటుండగా అకస్మాత్తుగా సన్యాసి వేషంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి చిన్నారి కాలు పట్టుకుని నేలపై కొట్టినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సున్నిత వాతావరణం ఏర్పడింది. చనిపోయిన చిన్నారి మృతదేహంతో సమీపవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Hyderabad : బాబోయ్.. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం, భయాందోళనలో జనం
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో తాము నిమగ్నమైనట్లు పోలీసులు తెలిపారు. మారువేషంలో ఉన్న సన్యాసి ఐదేళ్ల చిన్నారిని నేలపై పడేసి చంపాడని, దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఎలాగోలా ఆ వ్యక్తిని గుంపు బారి నుంచి రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
A 5 year old innocent child was brutally killed by Sadhu… Shame on humanity. pic.twitter.com/Gr9SzAma3X
— The Dalit Voice (@ambedkariteIND) August 20, 2023
ఈ విషయంపై మధుర దేహత్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ త్రిగుణ్ బిసెన్ మాట్లాడుతూ ఠానా గోవర్ధన్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిని బాబా హత్య చేశారని తెలిపారు. బాబాను అతని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అక్కడే చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను త్వరలో కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
మరోవైపు ఈ ఘటనపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఋషులు, సాధువుల అసలు ముఖం ఒక్కొక్కటిగా బయటపడుతోందని సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘మధురలో ఐదేళ్ల చిన్నారిని కొట్టి దారుణంగా హత్య చేశారు. వారిని సాధువులు అని కాకుండా హంతకులు, నేరస్థులు అని పిలుస్తారు’’ అని పోస్ట్ చేశారు.
