జయరామ్ హత్యకేసు : రాకేశ్ రెడ్డి ఇంట్లో పోలీసుల సీన్ రీకన్ స్ట్రక్ట్

జయరామ్ హత్యకేసు విచారణలో జూబ్లీహిల్స్ పోలీసులు దూకుడు పెంచారు.

  • Publish Date - February 14, 2019 / 09:20 AM IST

జయరామ్ హత్యకేసు విచారణలో జూబ్లీహిల్స్ పోలీసులు దూకుడు పెంచారు.

హైదరాబాద్ : జయరామ్ హత్యకేసు విచారణలో జూబ్లీహిల్స్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్ట్ చేశారు. గంటకు పైగా సీన్ రీకన్ స్ట్రక్ట్ చేశారు. డబ్బుల కోసమే జయరామ్ ను ఇంటికి రప్పించి హతమర్చానని రాకేష్ రెడ్డి వెల్లడించారు. హత్య తరువాత వాచ్ మెన్ శ్రీనివాస్ మరికొందరు సహకరించారని తెలిపారు. పోలీసుల విచారణకు శ్రిఖా చౌదరి హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో శ్రిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నేతలతో రాకేశ్ రెడ్డికి పలు కీలక అంశాలలో లింకులు వున్నట్లుగా పోలీసులు విచారణల్లో వెల్లడవుతున్న క్రమంలో రాకేశ్ రెడ్డితో సంబంధమున్న పలువురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

జయరాం  రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇవ్వాల్సిరావటంపై దృష్టి సారించిన పోలీసులు ఆ దిశగా విచారణను స్పీడప్ చేశారు. ఈ క్రమంలో జయరామ్ ను డబ్బులు అడిగేందుకు వెళ్లిన క్రమంలో హత్య జరిగినట్లుగా ఇప్పటి వరకూ జరిగిన విచారణలో వెల్లడైన క్రమంలో.. మరో కొత్త కోణం బైటపడింది. జయరాం రాకేశ్ రెడ్డికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విచారణలో వెల్లడయ్యింది. ఈ క్రమంలో హత్య జరిగిన తీరును పోలీసులు రీ కన్ స్ట్రక్ట్ చేస్తున్నారు. జయరామ్ హత్యలో శ్రిఖా చౌదరి పాత్ర, రాకేశ్ రెడ్డితో పరిచయాలు వంటి పలు కీలక అంశాలపై శ్రిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు.