Alabama shooting
Six of family found dead: జమ్మూకశ్మీర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు. మృతులను షాకినా బేగం, ఆమె ఇద్దరు కుమార్తెలు అఖ్తర్, రుబినా బానో, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఎల్ హబీబ్, సాజాద్ అహ్మద్ గా గుర్తించామని పోలీసులు చెప్పారు. సిధ్రా ప్రాంతంలోని వారి ఇళ్ళలోనే వారి మృతదేహాలు కనపడ్డాయని తెలిపారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించామని వివరించారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్న దానిపై స్పష్టతలేదు. వారు ఎలా మృతి చెందారన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి స్థానికులకు కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ