Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ

బిహార్‌లో ఎన్డీఏ నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలగడంతో ఆ రాష్ట్రంలో బలం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్‌లో 35 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ బిహార్ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, రవి శంకర్ ప్రసాద్, మంగళ్ పాండే, జనక్ రామ్, నంద కిశోర్ యాదవ్, తదితర నేతలు పాల్గొన్నారు.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024: బిహార్‌లో ఎన్డీఏ నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలగడంతో ఆ రాష్ట్రంలో బలం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్‌లో 35 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ బిహార్ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, రవి శంకర్ ప్రసాద్, మంగళ్ పాండే, జనక్ రామ్, నంద కిశోర్ యాదవ్, తదితర నేతలు పాల్గొన్నారు.

బిహార్ లో ఏర్పడ్డ మహా ఘట్ బంధన్ ప్రజలను మోసం చేస్తోన్న కూటమి అని జైశ్వాల్ చెప్పుకొచ్చారు. బిహార్ వ్యాప్తంగా బీజేపీ పోరాడుతుందని చెప్పారు. కోర్ కమిటీ సమావేశంలో బిహార్ గురించి అన్ని అంశాలపై చర్చించామని తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బిహార్ లో 35 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తుందని చెప్పారు. బిహార్ లో మొత్తం 40 లోక్ సభ సీట్లు ఉన్నాయి.

బీజేపీకి 17, జేడీయూకి 16, లోక్ జనశక్తి పార్టీకి 6, కాంగ్రెస్ కి ఒక సీటు ఉన్నాయి. బిహార్‭లో నిన్న 31 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. దేశ వ్యాప్తంగా తమకు తిరుగులేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ సఫలమవుతోన్న బీజేపీకి బిహార్ లో గట్టి షాక్ తగిలింది.

Teachers Face Recognition App : టీచర్లకు అటెండెన్స్ యాప్.. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? టీచర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?