Skeleton Found In Hospital Lift : 24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్…… అందులో బయటపడిన…….!

ఉత్తర ప్రదేశ్‌లోని ఒపెక్ ఆస్పత్రిలో 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ను అధికారులు ఇటీవల 3 రోజుల క్రితం తెరిచారు. అందులో వారికి ఓ అస్థిపంజరం కనిపించేసరికి షాక్ కు గురయ్యారు.

Skeleton Found In Hospital Lift : ఉత్తర ప్రదేశ్‌లోని ఒపెక్ ఆస్పత్రిలో 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ను అధికారులు ఇటీవల 3 రోజుల క్రితం తెరిచారు. అందులో వారికి ఓ అస్థిపంజరం కనిపించేసరికి షాక్ కు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని బస్తి జిల్లా కైలీ ప్రాంతంలో 1991 సంవత్సరంలో 500 పడకలతో ఒపెక్ ఆస్పత్రి ప్రారంభమయ్యింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఓ లిఫ్ట్ 1997 చెడిపోవటంతో దాన్ని రిపేరు చేయించకుండా వదిలేశారు. దాన్ని 24 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 1న తెరిచారు. దాన్ని తెరిచి చూసేసరికి అందులో ఒక అస్థిపంజరం కనపడే సరికి భయబ్రాంతులకు గురయ్యారు.

సమాచారం పోలీసులకు చేరవేశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అస్థిపంజరం ఒక పురుషుడిదిగా గుర్తించారు. పోలీసులు ఇప్పడు అస్థిపంజరం మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. గత 24 ఏళ్లలో ఆ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు.

అసలు ఆ వ్యక్తి లిఫ్టులోకి ఎలావెళ్లాడు ? అతడే లోపలకు వెళ్లాడా?…లేక ఎవరైనా హత్యచేసి మృతదేహాన్ని తీసుకవచ్చి అక్కడ పడేశారా ? లేక పొరపాటున ఆ వ్యక్తి లిఫ్టులో చిక్కుకుని ఊపిరాడక చనిపోయాడా ? వంటి కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ లేబరేటరీ రిపోర్టు వస్తే కానీ పూర్తి వివరాలుతెలిసే అవకాశం లేదంటున్నారు పోలీసులు. ఆస్థి పంజరం మిస్టరీని చేధించటానికి 24 పోలీసుస్టేషన్ల పోలీసులు పని చేస్తున్నారని  బస్తి జిల్లా ఎస్పీ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు