Software Engineer : రెండేళ్ల కొడుకును గొంతుకోసి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన రెండేళ్ల కొడుకును గొంతుకోసి హతమార్చిన ఘటన వెలుగు చూసింది.

Murder

Software Engineer :  హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన రెండేళ్ల కొడుకును గొంతుకోసి హతమార్చిన ఘటన వెలుగు చూసింది.

అభం శుభం తెలియని రెండు సంవత్సరాల కుమారుడిని కసాయి తండ్రి అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం… లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్‌కు చెందిన హాసిబ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆరేళ్ల క్రితం హస్రత్ బేగం అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు మగపిల్లలుపుట్టారు. కాగా గత మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధ పడుతున్న హాసిబ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
Read Also : Union Minister Nitin Gadkari : యూట్యూబ్ ద్వారా నెలకు రూ.4 లక్షలు ఆదాయం-నితిన్ గడ్కరీ

అయితే సెప్టెంబర్17 శుక్రవారం మధ్యాహ్నం గం.4-30 సమయంలో కోపంతో కత్తి తీసుకుని పెద్ద కుమారుడు ఇస్మాయిల్ (2)ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి, గొంతు కోసి పరారయ్యాడు. భార్య హస్రత్ బేగం ఇది గమనించి కొడుకును వెంటనే ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.