Union Minister Nitin Gadkari : యూట్యూబ్ ద్వారా నెలకు రూ.4 లక్షలు ఆదాయం-నితిన్ గడ్కరీ
కరోనాలాక్ డౌన్ సమయంలో లెక్చర్‌లు ఇచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వాటి మీద ప్రస్తుతం లక్షల రూపాయల ఆదాయం వస్తోందిట.

Nitin Gadkari
Union Minister Nitin Gadkari : కరోనా ప్రజలకు చాలా జీవిత పాఠాలు నేర్పిందనేది వాస్తవం. ఏ పాఠాలు ఎలా ఉన్నా కరోనాలాక్ డౌన్ సమయంలో లెక్చర్‌లు ఇచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వాటి మీద ప్రస్తుతం లక్షల రూపాయల ఆదాయం వస్తోందిట. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిపై ఈరోజు భరూచ్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
కొవిడ్ సమయంలో తాను రెండు పనులు చేశానని కేంద్ర మంత్రి చెప్పారు. చెఫ్‌గా మారి ఇంట్లో వంట చేశానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇచ్చానని తెలిపారు. ఆన్‌లైన్‌లో 950కి పైగా లెక్చర్లు ఇచ్చానన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు కూడా లెక్చర్లు ఇచ్చానని గడ్కరీ చెప్పారు.
Also Read : Home Minister Amit Shah : బీజేపీ ఎంఐఎంకు భయపడదు- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశానని, వాటికి వ్యూయర్‌షిప్ పెరగడంతో యూట్యూబ్ ఇప్పుడు నెలకు రూ.4 లక్షలు రాయల్టీగా చెల్లిస్తోందన్నారు. రోడ్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్లకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రేటింగ్ ఇవ్వడం ప్రారంభమైందని గడ్కరీ చెప్పారు.