Soldier Beaten to Death: డీఎంకే పార్టీ కౌన్సిలర్ దాడిలో గాయపడ్డ జవాన్ మృతి

ప్రభావకరన్ ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి కౌన్సిలర్ చిన్నస్వామి, ఆయన కుమారుడు రాజపండి సహా మరో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు బుధవారం పోలీసులు పేర్కొన్నారు. దాడి జరిగిన రోజు నుంచి వీరు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Soldier Beaten to Death: తమిళనాడు అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి చెందిన కౌన్సిలర్ సహా అతడి అనుచరులు చేసిన దాడిలో గాయపడ్డ 33 ఏళ్ల ఆర్మీ జవాన్ తాజాగా మరణించాడు. వాటర్ ట్యాంకు వద్ద బట్టలు ఉతుక్కుంటుండగా ఏర్పడ్డ వివాదం ప్రాణాలు తీసేంత వరకు వచ్చింది. కాగా, కౌన్సిలర్ చిన్నస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Ludhiana Police: వివాదాలతో స్టేషన్‌కొచ్చిన జంటలు.. టికెట్లుకొనిచ్చి సినిమా పంపించిన పోలీసులు

ఫిబ్రవరి 8న క్రిష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో ఒక వాటర్ ట్యాంకు వద్ద బట్టలు ఉతుక్కునే విషయంలో డీఎంకే నేత చిన్నస్వామి, ఆర్మీ జవాన్ ప్రభుకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. అనంతరం రాత్రి తొమ్మిది మంది గుంపుతో వచ్చిన కౌన్సిలర్.. ప్రభు సహా అతడి సోదరుడు ప్రభాకరన్‭ మీద దాడి చేసి విపరీతంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రభుని సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బుధవారం చికిత్స అందిస్తున్న క్రమంలోనే ప్రభు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Kanpur: భర్త, అత్తమామలకు డ్రగ్స్ ఇచ్చి నగలతో పరారైన పెళ్లికూతురు, ‘నేను నిన్ను ప్రేమించలేదు’ అంటూ మెసేజ్

ప్రభావకరన్ ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి కౌన్సిలర్ చిన్నస్వామి, ఆయన కుమారుడు రాజపండి సహా మరో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు బుధవారం పోలీసులు పేర్కొన్నారు. దాడి జరిగిన రోజు నుంచి వీరు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు