తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Publish Date - January 18, 2020 / 02:21 PM IST

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మామడ మండలం దిమ్మదుర్తిలో నాగరాజు, నవీన్ (22) తండ్రీకొడుకులు. అనారోగ్యంతో తండ్రి నాగరాజు మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి, తండ్రి మరణాన్ని తట్టులోక కొడుకు మృతి చెందిన సంఘనలు ఉన్నాయి. 2016, జులై 31న హైదరాబాద్ నగర పరిధిలో అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య, తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఇద్దరు కుమార్తెలు, కుమారుడు క్షణికావేశంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

నల్గొండ జిల్లాలో కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 2019, నవంబరు 14న రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక సైదులు ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.