Truck Runs Over People: డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు… నలుగురు మృతి
రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపైకి వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీలో జరిగింది.
- Narender Thiru
- Published On : September 21, 2022 / 10:02 AM IST
Truck Runs Over People: ఢిల్లీలో దారుణం జరిగింది. రోడ్డు మధ్యలో డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత, 02.00 గంటల సమయంలో సీమాపురి ప్రాంతంలో జరిగింది.
Bullettu Bandi Couple: లంచం తీసుకుంటూ దొరికిన ‘బుల్లెట్టు బండి’ పెళ్లి కొడుకు
డీటీసీ డిపో దగ్గర రెడ్ లైట్ క్రాస్ చేసిన ఒక గుర్తు తెలియని ట్రక్కు అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ సమయంలో డివైడర్‌పై ఆరుగురు నిద్రిస్తూ ఉన్నారు. ట్రక్కు దూసుకెళ్లడంతో వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు గమనించి, వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే నలుగురిలో ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
Couple Consumes Poison: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పది రోజులకే ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు కారణమైన ట్రక్కును గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
