కూతురిపై తండ్రి అత్యాచారం : ఇంకెక్కడ ఆడబిడ్డలకు భద్రత

  • Publish Date - December 5, 2019 / 05:10 AM IST

సూర్యాపేట జిల్లాలో కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి కామాంధుడిలా మారాడు. గొల్ల బజార్‌లో డబుల్ బెడ్ రూం కాలనీలో బిడ్డలా చూసుకోవాల్సిన సవితి తండ్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

మహబూబాబాద్‌కు చెందిన మహిళ పదేళ్ల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆమెకు  ఇద్దరు కొడుకులు..ఒక కూతురు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బానోత్ శ్రీను అనే వ్యక్తితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. తల్లితో సహజీవనం చేస్తున్న శ్రీను కూతురిలాంటి బాలికపై కన్నేశాడు. ఓ రోజు తల్లి కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న16 ఏళ్ల కూతురిపై శ్రీను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు.

తల్లికి చెప్పినా..ఆమెను మీ సోదరుల్ని కూడా చంపేస్తానంటు బెదిరించటంతో భయపడిన బాలిక మౌనంగా ఉండిపోయింది. దీన్ని ఆసరా చేసుకున్న సవితి తండ్రిలాంటి కామాంధుడు పదే పదే బాలికను లొంగదీసుకోవటానికి వేధిస్తున్నాడు.  చెప్పినమాట వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. 
దీంతో సవితి తండ్రి వేధింపులు భరించలేదని బాలిక తల్లితో విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నడి వీధిలోనే కాదు ఇంట్లో నాలుగు గోడల మద్య కూడా ఆడబిడ్డలకు భద్రత లేకుండా పోతోందని అనటానికి ఇటువంటి మృగాళ్లే ఉదాహరణగా కనిపిస్తున్నారు. మరి ఇంకెక్కడ ఆడపుట్టులకు భద్రత అనే భాయందోళన కలుగుతోంది ఇటువంటి ఘటనలతో.