తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో భక్తుడి ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలోని తిరుమలలో విషాధ ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Publish Date - December 13, 2019 / 07:44 AM IST

చిత్తూరు జిల్లాలోని తిరుమలలో విషాధ ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో విషాధ ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీవారి ఆలయ సమీపంలో టీటీడీకి చెందిన పాల వాహనం కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కలకలం రేపింది. కళ్లారా చూసిన ఇతర భక్తులు, అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఆలయ మాడ వీధుల్లో నడుచుకుంటూ వస్తున్న భక్తుడు ఉన్నట్టుండి వాహనం వెనుక టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.

పాల వ్యాన్ కిందపడి శ్రీవారి భక్తుడు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని టీటీడీ ఆగమసలహాదారు రమణదీక్షితులు అన్నారు. మాడ వీధుల్లో ఆత్మహత్య ఘటన జరగడంతో ఆలయాన్ని శుద్ధి చేస్తామని, ఆ తర్వాత యథావిధిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆత్మహత్యలు మహాపాపం అన్నారు. భక్తులెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదన్నారు.