తహశీల్దార్ సజీవ దహనం కేసు : హత్య చేసిన రైతు ఇతడే

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన

  • Publish Date - November 4, 2019 / 11:10 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడిని రైతు సురేష్ గా పోలీసులు గుర్తించారు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయారెడ్డి వేధిస్తున్నారని అందుకే తాను హత్య చేశానని విచారణలో సురేష్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తహశీల్దార్ కు నిప్పు పెట్టిన సమయంలో సురేష్ కి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చొక్కా విప్పేసిన సురేష్.. తలుపులు తీసిన బయటికి పరుగులు తీశాడు. నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

తహశీల్దార్ విజయారెడ్డికి లైటర్ తో నిప్పంటించాడని, ఆ సమయంలో సురేష్ కూ మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. కాలిన గాయాలతోనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చాడని, పీఎస్ బయట పడిపోయాడని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని సురేష్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు 60 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్ ను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

నిందితుడు పూర్తి పేరు కుర్రా సురేష్ అని.. గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు అని పోలీసులు తెలిపారు. సురేష్ కి సంబంధించిన భూమి వివాదంలో ఉందని, దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఈ విషయమై తహశీల్దార్ ను హత్య చేశాడా లేక మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉందన్నారు. సురేష్ పై హత్యా నేరం ఫైల్ చేస్తున్నామని, ఉరిశిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెప్పారు.

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.20గంటల ప్రాంతంలో సురేష్ ఆఫీస్ లోకి వచ్చాడు. తహశీల్దార్ తో మాట్లాడాలని చాంబర్ లోనికి వెళ్లాడు. ఇద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలి నుంచి కేకలు వినిపించాయి. తహశీల్దార్ విజయ మంటల్లో తగలబడిపోతున్నారు.

ఆమె అరుచుకుంటూ బయటకు వచ్చారు. ఇద్దరు సిబ్బంది ఆమెని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. తీవ్ర గాయాలు కావడంతో విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.