తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో దారుణం జరిగింది. రోజా(20) అనే యువతి దారుణ హత్యకు గురైంది. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ముళ్లపొదల్లో రోజా మృతదేహాన్ని గొర్రెల
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో దారుణం జరిగింది. రోజా(20) అనే యువతి దారుణ హత్యకు గురైంది. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ముళ్లపొదల్లో రోజా మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. నవంబర్ 23న పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ అందింది. కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలో మృతదేహాన్ని చూసిన వారు.. తమ కూతురు రోజా అని నిర్ధారించారు.
రోజాది సిరివల్లూర్. శ్రీపెరంబదూర్ లో ఓ కంపెనీలో పని చేస్తోంది. కాగా, పెళ్లయిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందోని పోలీసుల విచారణలో తేలింది. ఆమె గొంతు చుట్టూ గాయం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. రోజాని చెట్టుకి వేలాడదీసి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కనిపించకుండా పోయిన రోజాని.. చివరికి ఇలా విగతజీవిగా చూసి అంతా షాక్ తిన్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగింది? రోజాది హత్య? ఆత్మహత్య? రోజాని ఎవరు చంపారు? రేప్ చేసి మర్డర్ చేశారా? విహితుడితో సంబంధమే ప్రాణం తీసిందా? ఇలా అనేక ప్రశ్నలు. రోజా మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. లైంగిక దాడులకు పాల్పడి హత్యలు చేస్తున్నారు. హైదరాబాద్ లో డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు మృగాళ్లు ప్రియాంకను బలితీసుకున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారి భద్రత గురించి భయపడుతున్నారు. బయటికి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు.