ప్రభుత్వ ఉద్యోగికి టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

  • Publish Date - April 25, 2019 / 04:21 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో ఓ ఉద్యోగిని ఫోన్‌లో బెదిరించారు. పోస్టల్‌ బ్యాలెట్లన్నీ తనకు అనకూలంగా సేకరించాలని రాపూరు మండలం తెగచర్ల ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను ఫోన్‌లో ఆదేశించారు. లేకపోతే అంతుచూస్తానని బెదిరించారు. ఎమ్మెల్యే రామకృష్ణ ఫోన్‌ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఎమ్మెల్యే  రామకృష్ణ  బెదిరింపులపై బాధిత ఉద్యోగి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు.