టీచర్ చితకబాదడంతో చిన్నారి మృతి

వనపర్తి జిల్లాలో టీచర్ ఆగ్రహానికి చిన్నారి బలి అయింది. సరిగ్గా చదవడం లేదని చితకబాదడంతో మృతి చెందాడు.

  • Publish Date - April 18, 2019 / 06:59 AM IST

వనపర్తి జిల్లాలో టీచర్ ఆగ్రహానికి చిన్నారి బలి అయింది. సరిగ్గా చదవడం లేదని చితకబాదడంతో మృతి చెందాడు.

వనపర్తి జిల్లాలో టీచర్ ఆగ్రహానికి చిన్నారి బలి అయింది. సరిగ్గా చదవడం లేదని చితకబాదడంతో మృతి చెందాడు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం లింగమయ్య తాండకు చెందిన హన్మంతు నాయక్ కుమారుడు వంశీ రెండో తరగతి చదువుతున్నాడు. 15 రోజుల క్రితం కోచింగ్ కోసం వనపర్తి జిల్లా నాగవరంలోని సింధూజ నవోదయ కోచింగ్ సెంటర్ లో తల్లిదండ్రులు జాయిన్ చేశారు. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

అయితే సరిగ్గా చడవడం లేదని నిర్వహకుడు, టీచర్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో వంశీ తీవ్రంగా గాయపడి అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిలోఫర్ కు తరలించారు. పది రోజులుగా నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 18 గురువారం బాలుడు మృతి చెందాడు. మృతదేహంతో కోచింగ్ సెంటర్ ఎదుట బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ధర్నా చేపట్టారు. యాజమాన్యం కొట్టడం వల్లే తీవ్రంగా గాయపడి మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. వేలాదిగా డబ్బులు ఇచ్చి తమ బాబును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు