Govt School Students Clean Toilet
Govt School Students Clean Toilet : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పాఠాలు, విద్యాబుద్ధలు నేర్పాల్సిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో టాయిలెట్‌ను శుభ్రం చేయించారు. బాలియా జిల్లాలోని పిప్రాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో టాయిలెట్ ను కడిగించారు. అంతేకాకుండా టాయిలెట్ పరిశుభ్రంగా లేకపోవడంతో ఇంటికి పంపిస్తానని విద్యార్థులను బెదిరించారు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దీంతో వీడియో వైరల్‌గా అయింది. అదికాస్తా అధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.