Boy Falls : బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాబు ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు పైనుంచి కిందకు పడిన ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శివప్ప, అంబిక దంపతులు బెంగళూరులోని కెన్ గెరిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బాబు ఆడుకుంటున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. ఎలా జరిగిందో తెలియదు కానీ, సెకండ్ ఫ్లోర్ నుంచి బాబు కిందకి పడిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాబు పైనుంచి కింద పడినప్పుడు అక్కడ పెద్ద శబ్దం వచ్చింది.
Also Read..Couple Kissing : హవ్వ.. లోకల్ ట్రైన్లో రెచ్చిపోయిన ప్రేమజంట, పబ్లిక్‌గా లిప్‌లాక్
బాబు పైనుంచి కింద పడటంతో అపార్ట్ మెంట్ వాసులు షాక్ అయ్యారు. ఇంతలో తల్లిదండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు పరిగెత్తుకుని వచ్చారు. అంతా భయపడిపోయారు. బాబుకి ఏం జరిగిందోనని కంగారుపడ్డారు. పైనుంచి కిందకు పడటంతో బాబు తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే, బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాద వీడియో నెటిజన్లను షాక్ కి గురి చేస్తోంది.
Also Read..Firing In Cinema Style : బాబోయ్.. సినిమా స్టైల్లో ఎదురు కాల్పులు, వీడియో వైరల్
కాగా, ఇది చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. పిల్లలను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేది ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని చెప్పడానికి ఈ ప్రమాదమే నిదర్శనం.
ಅಪ್ಪ-ಅಮ್ಮನ ಎದುರೇ ಬಾಲ್ಕನಿಯಿಂದ ಬಿದ್ದು 3 ವರ್ಷದ ಮಗು ಗಂಭೀರ #Bengaluru #Child https://t.co/O4HuRHsMu4 pic.twitter.com/FWXrZBLpRb
— NewsFirst Kannada (@NewsFirstKan) March 10, 2023