Tractor Accident: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 20మందికి గాయాలయ్యాయి.
- Harishth Thanniru
- Updated on- June 5, 2023 / 02:57 PM IST
tractor Accident
Guntur District: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మరణించగా, మరో 20మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వట్టిచెరుకూరులో జరిగింది. ట్రాక్టర్‌లో చేబ్రోలు మండలం జూపుడికి శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ప్రమాద సమయంలో అందులో మొత్తం 35మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్సనిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
Karnataka accident:కర్ణాటకలో కారు-లారీ ఢీ..నలుగురి దుర్మరణం
వంటిచెరుకూరు వద్ద పంట కాల్వలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో 20 మంది కి గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా తెలిసింది.
