×
Ad

Eluru Pawan Kalyan Murder : పవన్ కల్యాణ్ దారుణ హత్య.. ఏలూరులో ఘోరం, ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

ఏలూరులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. గొడుగుపేటకు చెందిన నాగరాజు.. పవన్ ను హత్య చేసినట్లు పవన్ బంధువులు ఆరోపిస్తున్నారు.

  • Published On : October 17, 2022 / 11:35 PM IST

Eluru Pawan Kalyan Murder : ఏలూరులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. గొడుగుపేటకు చెందిన నాగరాజు.. పవన్ ను హత్య చేసినట్లు పవన్ బంధువులు ఆరోపిస్తున్నారు.

గొడుగుపేటకు చెందిన శ్యామల, లక్ష్మీపురం వాసి పవన్ కల్యాణ్ ప్రేమించుకున్నారు. అయితే వీరివి వేర్వేరు కులాలు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన శ్యామల జూన్ 5న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో యువతి తండ్రి నాగరాజు.. పవన్ పై కక్ష పెంచుకున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పవన్ కల్యాణ్ ఈ నెల 15న నిమ్మలగూడెం వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామల తండ్రి నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. వాస్తవం వెలుగులోకి వచ్చింది. పవన్ ను తానే చంపానని నాగరాజు ఒప్పుకున్నాడు. పవన్ ను చంపి డెడ్ బాడీని తన తోటలోనే పూడ్చి పెట్టినట్లు అతడు పోలీసులతో చెప్పాడు. నాగరాజు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డెడ్ బాడీని వెలికితీశారు. పవన్ ను పొట్టన పెట్టుకున్న నాగరాజుని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.