Trainee Aircraft Crashes In Bhopal 3 Pilots Injured1
Trainee aircraft crashes in Bhopal, 3 pilots injured : ప్రభుత్వ సర్వే కోసం బయలుదేరిన విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే పొలాల్లో కుప్పకూలింది. అదృష్టవశాత్తు పైలట్లు ప్రాణాలతో బయటపడిన ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది.
భోపాల్ నుంచి గుణ కు ముగ్గురు పైలట్లతో కూడిన శిక్షణ విమానం శనివారం మధ్యాహ్నం రాజభోజ్ విమానాశ్రయం నుంచి బయలు దేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే భోపాల్ శివారులోని బిషన్ కేడీ ప్రాంతంలోని పొలాల్లో ఆ విమానం పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు పైలట్లకు గాయాలయ్యాయి.
విమానం కింద పడిపోవటంతోవారు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. విమానం కింద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్ధానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతోవారు వచ్చిమంటలను అదుపులోకి తెచ్చారు. విమానం కింద పడటానికి గల కారణాలు తెలియల్సి ఉంది. గాయపడిన పైలట్లను ఆస్పత్రికితరలించి చికిత్స అందిస్తున్నారు.