Gadwal nude video call case
Gadwal nude video call case : గద్వాల న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో గద్వాల పోలీసులు అరెస్ట్ చేసినవారిన పోలీసులు కావాలనే వదిలేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అసలైన నిందుతులను పోలీసులు కావాలనే వదిలేసి తమ పిల్లలను ఇరికించారనే ఆరోపణలపై దృష్టిపెట్టారు. ఈ కేసులో దర్యాప్తు చేసివారిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వీరి విచారణలో ట్విస్ట్ చేసుకుంది. అరెస్ట్ అయినవారిలో ఓ పోలీసులు అధికారికి సంభంధించిన సన్నిహితుడు ఉన్నాడని తేలింది. ఈకేసులో ఇప్పటివరకు అరెస్ట్ వారితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.
గద్వాల గలీజ్ కాల్స్ వ్యవహరంలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరొక నిందితుడు కోసం గాలిస్తున్నారు. ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గద్వాల్‌లో గలీజ్ కాల్స్ యువతులు, మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఏ కాల్‌లో ఏ రాక్షసుడు ఉంటాడో తెలియని అమ్మాయిలు హడలిపోతున్నారు. ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయటానికే భయపడిపోతున్నారు. ఒకడు ప్రేమంటాడు. మరొకడు ఫ్రెండ్ షిప్ అంటాడు. కమిట్ అయితే ఆనక బ్లాక్ మెయిల్ కు దిగుతాడు. అందమైన మాటల వెనుక ఎటువంటి కుట్రలు దాగున్నాయో తెలీదు. గద్వాలలో ఇప్పుడిదే జరుగుతోంది..పచ్చని కాపురాలు బుగ్గిపాలవుతున్నాయి. అందమైన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇంతకీ ఈ కాల్స్ చేస్తున్న వాళ్లెవరు..వాళ్లకు కావాల్సిందేంటి..?
సోషల్ మీడియాలో పరిచయమవుతున్నారు. అక్కడ ఫోటోలు చూసి చాట్ స్టార్ట్ చేస్తున్నారు. అలా మెల్లగా పరిచయం పెంచుకుని ఫోన్ నంబర్లు తీసుకోవటం..వాట్సాప్ చాట్స్, వీడియో కాల్స్‌తో మరింత దగ్గరవ్వటం నమ్మకం కుదిరాక ప్రేమ అంటారు. నమ్మి అన్నీ షేర్ చేసుకుంటే ఇక నరకం చూపిస్తారు. కమ్మని మాటలతో బుట్టలో పడేస్తున్నారు. న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. వాళ్లకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వీళ్ల మాయలో పడిన అమ్మాయిలు, మహిళలు వాళ్లు చెప్పినట్లే చేస్తున్నారు. పూర్తిగా నమ్మేశాక.. న్యూడ్ కాల్స్‌తో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అప్పుడే వారిలో ఉండే అసలైన రాక్షసుడు బయటపడతాడు. క్రైమ్ కహానీ మొదలుపెడతారు.
తమతోనే కాదు తాము చెప్పిన వాళ్లతో గడపాలని..లేకపోతే న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని.. బెదిరిస్తున్నారు. ఇలా బెదిరిస్తున్న వాళ్లలో రాజకీయ నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పలు రకాల ప్రొఫెషన్లకు చెందినవారు ఉంటున్నారు. ఈ అరాచకం పెరిగపోవటంతో కొంతమంది బాధితులు ధైర్యం చేసిన పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేటుగాళ్ల అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరిపై కేసు ఫైల్ చేశారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో నిందితుడికోసం గాలిస్తున్నారు.
ఈక్రమలో ఈకేసులో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్ చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అసలైన నిందితులను వదిలేసి మా పిల్లలను అన్యాయంగా అరెస్ట్ చేశారని..టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని..సిట్ తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో గద్వాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
హరిప్రసాద్ అసలైన నిందుతల నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకున్నారని అందుకే అసలై నిందుతులను వదిలేసి తమ పిల్లలను అన్యాయంగా ఇరికించి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. అరెస్ట్ అయినవారిలో ఒకరు ఎస్ఐకి సన్నిహితుడని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని అసలైన నేరస్థులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.