బ్రేకింగ్ : ఎన్ కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతం

  • Publish Date - February 17, 2020 / 03:19 AM IST

 దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పలు  హత్యలు ఇతర నేరాలతో సంబంధం ఉన్న ఇద్దరు కరడు గట్టిన నేరస్తులను పోలీసులు అంతమొందించారు.  మరణించిన ఇద్దరు  నేరస్తులను రాజా ఖురేషి, రమేష్‌ బహదూర్‌లుగా గుర్తించారు. ఖురేషి, బహదూర్‌ల కోసం కరవాల్‌నగర్‌ మర్డర్‌ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.