Occult Worship : క్షుద్రపూజల అనుమానంతో కుటుంబంపై దాడి-ఇద్దరు మృతి
- chvmurthy
- Published On : July 12, 2022 / 08:49 PM IST
Prakasam District Murder
Occult Worship : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసి తన ఎదుగుదలకు అవరోధం కల్గిస్తున్నారనే అనుమానంతో ఒక వ్యక్తి బంధువులపై హత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మరణించగా మరోక వ్యక్తి పరిస్ధితి విషమంగా ఉంది.
జిల్లాలోని గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామంలో కుక్క మల్లికార్జున రావు అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి వాళ్ల బాబాయి, పిన్నిలతో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తన బాబాయి, పిన్ని తనపై క్షుద్రపూజలు చేసి తన ఎదుగుదలకు అవరోధం కల్పిస్తున్నారనే అనుమానం పెరిగింది.
ఈరోజు బాబాయ్ తిరుమలయ్య కుటుంబంపై ఇటుక రాయితో దాడి చేసి విచక్షణా రహితంగా వారిని కొట్టాడు. ఈ దాడిలో అతని పిన్ని ఈశ్వరమ్మ అక్కడికక్కడే చనిపోగా… పిన్ని కూతురు స్వప్న ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. స్వప్న ప్రస్తుతం 6నెలల గర్భవతి.
తీవ్ర గాయాలపాలైన తిరుమలయ్య పరిస్ధితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.దాడికి పాల్పడిన తర్వాత మల్లికార్జునరావు సంఘటన స్ధలం నుంచి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read : Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
