Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ లో మరో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న సప్లయర్ తోపాటు మరో నలుగురు పెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ పోర్స్ మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hyderavad Drugs Racket

Drugs Racket : హైదరాబాద్ లో మరో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న సప్లయర్ తోపాటు మరో నలుగురు పెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ పోర్స్ మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 36 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

మరో 16 మంది డ్రగ్స్ వినియోగ దారులను గుర్తించి అందులో 8 మందిని అరెస్ట్ చేశారు.  వీరందరినీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.  డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా చెన్నైలోని ఓ కాలేజీలో చదువుతున్నప్పుడు మెయిన్ సప్లయర్ నుండి డ్రగ్స్ తీసుకోవడం చేస్తుండేవాళ్ళని ఆయన తెలిపారు.

అక్కడ చదువు పూర్తయి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత పెడ్లర్లుగా మారారని…. వీరు  నిషేధిత మాదక ద్రవ్యాలను   గ్రాము ఏడు వేల రూపాయల చొప్పున హైదరాబాద్ లో   విక్రయిస్తున్నారని   డేవిస్ వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన విష్ణు  పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని   డీసీపీ చెప్పారు.

Also Read : Dating App Trap : కొంపముంచిన ఆ బలహీనత.. హైదరాబాద్ డాక్టర్ నుంచి కోటిన్నర కాజేసిన సైబర్ క్రిమినల్స్