Cyber Crime : డాక్టర్ కొంపముంచిన ఆ బలహీనత.. కోట్లు పొగొట్టుకున్నాడు

ఆ బలహీనత డాక్టర్ కొంపముంచింది. ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకునేలా చేసింది. డాక్టర్ తీరు కుటుంబసభ్యులనే కాదు పోలీసులను సైతం షాక్ కి గురి చేసింది.

Cyber Crime : డాక్టర్ కొంపముంచిన ఆ బలహీనత.. కోట్లు పొగొట్టుకున్నాడు

Cyber Crime

Dating App Trap : సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో ఏకంగా ఓ డాక్టరే పడ్డాడు. దాదాపు కోటిన్నర రూపాయలు సమర్పించుకోవడం సంచలనంగా మారింది. ఈ సైబర్ క్రైమ్ షాక్ కి గురి చేస్తోంది. ఈ సంచలన క్రైమ్ కి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ 10టీవీకి వెల్లడించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

‘తీయటి మాటలతో నగరానికి చెందిన ఓ డాక్టర్ కోటిన్నర రూపాయల సమర్పించుకున్నాడు. జుగులో లోకోటో లోకల్ యాప్ లో అమ్మాయిల కోసం ఆ డాక్టర్ 2020, 2021లో కోటిన్నర రూపాయలు పోగొట్టుకున్నాడు. అమ్మాయిల ఫొటోలు చూపి కోట్లు వసూలు చేశారు సైబర్ చీటర్స్. మూడేళ్లలో డాక్టర్ నుంచి కోటిన్నర కాజేశారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.

సైబర్ కిలాడీలు : ఆదిలాబాద్‌లో ఆరోగ్యశ్రీ పేరిట రూ. 81 వేలు కొట్టేశారు

జుగు యాప్ లో మూడేళ్లుగా డాక్టర్ చాటింగ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల్లో నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో డాక్టర్ ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. నిందితుడి ఖాతాలో రూ.18 లక్షలు పడినట్టుగా ఆధారాలు సేకరించాం. నేరం అంగీకరించిన నిందితుడు కొంత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

అయితే కొన్ని రోజులకు డాక్టర్ యూటర్న్ తీసుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అతడిని వదిలేయాలని మాపై ఒత్తిడి తెచ్చాడు. అతడు ఇచ్చే డబ్బు కూడా తనకు వద్దని.. తనను మోసం చేసింది అతడు కాదని చెప్పుకొచ్చాడు. చివరికి లోక్ అదాలత్ ద్వారా ఆ డాక్టర్.. కేసుని వాపస్ తీసుకున్నాడు.

సైబర్ క్రిమినల్స్ టార్గెట్ వాళ్లే..

ఇప్పుడు డాక్టర్ ఫ్యామిలీ మెంబెర్స్ కి అనుమానం వచ్చింది. డాక్టర్ దఫాలుగా మరికొంత డబ్బు సైబర్ నేరగాళ్ల అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేసినట్లు వారు తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు. అమ్మాయిల ఫొటోలు చూపి, తీయని మాటలతో సైబర్ చీటర్స్ డబ్బు కొట్టేస్తున్నారు. పోలీసులు, మేము చాలాసార్లు డాక్టర్ కి కౌన్సిలింగ్ ఇచ్చాం. డాక్టర్ అకౌంట్ నుంచి డబ్బు మాయం కావడంపై కుటుంబసభ్యుల ఆరా తీశారు. పోలీసులు, కుటుంబసభ్యుల మాటలను డాక్టర్ పెడచెవిన పెట్టాడు. కౌన్సిలింగ్ ఇచ్చినా డాక్టర్ లో మార్పు లేదు. సికింద్రాబాద్‌కు చెందిన బాధిత డాక్టర్.. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లకు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం గుజరాత్‌‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు” అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు.