సైబర్ క్రిమినల్స్ టార్గెట్ వాళ్లే..

సైబర్ క్రిమినల్స్ టార్గెట్ వాళ్లే..

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫిష్షింగ్ సైట్లు, ట్రాపింగ్ మెసేజ్‌లు పంపి లక్షల్లో లూటీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూటు మార్చిన సైబర్ క్రిమనల్స్ టార్గెట్ అంతా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్లపైనే పెట్టారట. వాళ్లు అయితే ఎటువంటి నష్టం జరిగినా పెద్ద వాళ్లకు చెప్పేందుకు భయపడి సైలెంట్ గా ఉండిపోతారని కాబోలు. దాంతో పాటు ఫ్రీ బెనిఫిట్‌తో బురిడీ కొట్టించడానికి వీళ్లు అయితేనే త్వరగా పడిపోతారు. 

ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లలకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పించాలని సైబరాబాద్.. సైబర్ క్రైమ్ అసిస్టెబట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వై శ్రీనివాస్ కుమార్ అంటున్నారు. పిల్లలను విద్యావంతులను చేసి, ఫ్రీగా వచ్చే ఆఫర్లను చూసి మోసపోవద్దని సూచించారు. ఆన్‌లైన్‌ ఓ వ్యసనంగా మారి ఫిజికల్, మెంటల్ హెల్త్‌పై దుష్ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ప్రైవసీ, సెక్యూరిటీ గురించి పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. 

దీని కోసమే పోలీసు శాఖ సైబర్ మిత్రను మొదలుపెట్టి మహిళలు పిల్లలకు భద్రత కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఏ సమయంలోనైనా కంప్లైంట్ చేయడానికి అందుబాటులోనే ఉంటామని హామీ ఇచ్చారు. పిల్లలను చైతన్యం చేయడంలో పేరెంట్స్, స్కూల్ స్టాఫ్ పాత్ర కీలకం. ఎమోషనల్‌గా బలహీనం చేయడంతో పిల్లలను సులువుగా మోసం చేస్తున్నారు. 

సైబర్ క్రిమినల్స్ ఏ వయస్సు వారిని టార్గెట్ చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా బలంగా ఉండాలి. టీనేజర్స్, పదేళ్ల కంటే తక్కువ వయస్సున్న వారిపైనే ఎక్కువ ప్రభావం ఉటుంది. ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో వీటిపై క్యాంపులు నిర్వహించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.