Viral Video: ఈవ్ టీజర్‌కు గుణపాఠం.. యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు.. వీడియో వైరల్
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు.
- Narender Thiru
- Published on- February 15, 2023 / 06:09 PM IST
Viral Video: అమ్మాయిలు ఉగ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. యుక్త వయసు వచ్చిన అమ్మాయిలకు ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఈవ్ టీజింగ్. కాలేజీ, బస్టాప్, మార్కెట్లు వంటి పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్లినా ఎవడో ఒకడి రూపంలో అమ్మాయిలకు ఈవ్ టీజింగ్ ఎదురవుతూనే ఉంటుంది.
Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్
ఎక్కడికి వెళ్లినా ఫాలో అవ్వడం, అసభ్యకర మాటలు, చేతలతో ఈవ్ టీజర్లు వేధిస్తుంటారు. వీటిని చాలా మంది మౌనంగానే భరించి వెళ్లిపోతుంటారు. దీంతో వాళ్లు మరింత రెచ్చిపోతుంటారు. అయితే, అందరూ అలా ఉండరుగా! కొందరు అమ్మాయిలు తమకు ఈవ్ టీజింగ్ ఎదురైతే వెంటనే స్పందిస్తారు. ఈవ్ టీజింగ్ చేసిన వాడికి తగిన బుద్ధి చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది మహారాష్ట్రలో. ఇద్దరు అమ్మాయిలు ఒక ఈవ్ టీజర్‌ను పట్టుకుని చితక్కొట్టేశారు. కల్యాణ్ ప్రాంతం, అంబివల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని వడవాలి గ్రామంలో ఈ ఘటన మంగళవారం జరిగింది.
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. దగ్గర్లోని ఒక బెంచీపై కూర్చోబెట్టి, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకరి తర్వాత ఒకరు కొట్టడం, తన్నడం చేశారు. అతడు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అమ్మాయిలు వదల్లేదు. అక్కడే ఉన్న ఒక మహిళ, అమ్మాయిలకు చీపురు తీసుకొచ్చి ఇచ్చింది. దీంతో అతడిని చీపురుతో కొట్టారు. ఈ దృశ్యాన్ని అక్కడి వాళ్లెవరో వీడియో తీయగా, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని, అయితే, ఈ వీడియో ఆధారంగా దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని స్థానికులు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఇక్కడ ఇలాంటి ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువయ్యాయని, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
