Madhya Pradesh: శాలరీ గురించి అడిగితే ఎముకలు విరిచేస్తా.. ప్రశ్నించిన పౌరుడిపై మంత్రి ఆగ్రహం.. వీడియో వైరల్

మంత్రి మాట్లాడుతుండగా, జనంలోంచి ఒక వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాడు. తన భార్య అంగన్‌వాడీ సెంటర్‌లో వంట పని చేస్తోందని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన మంత్రిని ప్రశ్నించారు.

Madhya Pradesh: శాలరీ గురించి అడిగితే ఎముకలు విరిచేస్తా.. ప్రశ్నించిన పౌరుడిపై మంత్రి ఆగ్రహం.. వీడియో వైరల్

Madhya Pradesh: వేతనాల గురించి ప్రశ్నించిన ఒక పౌరుడిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం వికాస్ యాత్ర పేరుతో ర్యాలీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఖండ్వా జిల్లాలో ఒక కార్యక్రమం జరిగింది.

Trains cancelled: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడి వాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మంత్రి మాట్లాడుతుండగా, జనంలోంచి ఒక వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాడు. తన భార్య అంగన్‌వాడీ సెంటర్‌లో వంట పని చేస్తోందని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన మంత్రిని ప్రశ్నించారు. దీంతో మంత్రికి కోపం వచ్చింది. అందరిముందే అతడికి హెచ్చరికలు జారీ చేశాడు.

MP Komatireddy: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ.. ‘హంగ్’ వ్యాఖ్యలపై కోమటిరెడ్డిని ప్రశ్నించిన ఠాక్రే

తన ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించి, సభలో ఆటంకం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పోలీసులకు చెప్పి అతడి ఎముకలు విరిచేస్తానన్నాడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభలో ఇలా ఆటంకం కలిగించడం సరికాదన్నారు. మంత్రి సూచనలతో పోలీసులు ప్రశ్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను అక్కడి వాళ్లు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనను ప్రశ్నించిన వ్యక్తిపై మంత్రి ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు అక్కడి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మంత్రి తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. కావాలనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు తన సభలో ఆటంకం కలిగించాలని ప్రయత్నించారని మంత్రి అన్నారు.