MP Komatireddy: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ.. ‘హంగ్’ వ్యాఖ్యలపై కోమటిరెడ్డిని ప్రశ్నించిన ఠాక్రే

ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అనలేదని కోమటిరెడ్డి అన్నారు.

MP Komatireddy: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ.. ‘హంగ్’ వ్యాఖ్యలపై కోమటిరెడ్డిని ప్రశ్నించిన ఠాక్రే

MP Komatireddy: కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రేతో కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఇరువురి మధ్య గంటన్నరకు పైగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు.

Rachamallu Siva Prasad Reddy: ఆమెతో ఫొటో దిగితే నేరం చేసినట్టా.. అందుకే విశాఖ రావాల్సివచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే

ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అనలేదని కోమటిరెడ్డి అన్నారు. దీనిపై ఠాక్రే స్పందిస్తూ పార్టీ వ్యవహారాలపై వ్యక్తిగతంగా మాట్లాడితే సరికాదని హెచ్చరించారు. కోమటిరెడ్డి వివరణపై ఠాక్రే హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సమావేశం అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలపై చర్చించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ‘‘ఠాక్రే నన్ను బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిచారు. నేను ఆలస్యంగా వచ్చాను. ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనే దానిపై చర్చించాం.

Andhra pradesh Politics: కాపుల చుట్టే ఏపీ రాజకీయం..‘కమలం రంగా జపం’..! జీవీఎల్ ఒకవైపు.. కన్నా మరోవైపు..మధ్యలో ఏపీ మ్యాప్..!!

అభ్యర్థులకు ముందస్తుగా టిక్కెట్లు ఇవ్వాలని కోరాను. గతంలో ఆలస్యంగా టికెట్ల అనౌన్స్ చేయడం వల్ల గోల్కొండ హోటల్ లో గొడవలు జరిగాయి. అప్పట్లో తెలుగుదేశంతో పొత్తు వద్దన్నాను. నిన్నటి కామెంట్స్‌పై చర్చ జరగలేదు. మీడియాలో నా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేశారు. బోసు రాజు నా వ్యాఖ్యల్ని తెలుగులో తెప్పించుకుని, ఠాక్రేకు వివరించారు. ఠాక్రే లైట్ తీసుకున్నారు. నా పార్టీ వాళ్లు నా వీడియో పూర్తిగా చూడలేదనుకుంటా. ఓ సర్వే రిపోర్ట్ ద్వారా నేను నిన్న మాట్లాడాను. నిన్నటి విషయం అవసరం లేదు. గెలిచే వాళ్లకు టిక్కెట్ ఇవ్వాలని కోరాను.

ముందు టిక్కెట్ ఇస్తే గెలుస్తారు. నా పాదయాత్ర ఈ నెలాఖరులో ఉంటుంది. భువనగిరిలో మొదలుపెడతా. ఉత్తమ్ నల్గొండలో మొదలుపెడతారు. ఖమ్మంలో కూడా యాత్ర చేస్తాం. గ్రామాల్లో బైక్ యాత్రలు చేస్తాం. సర్కారు వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.