వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు

నిజామాబాద్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడు వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు.

  • Publish Date - September 1, 2019 / 01:45 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడు వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు.

నిజామాబాద్ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడు వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి బంగారం దోచుకున్నాడు. వేల్పూర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గంగు అనే వృద్ధురాలు పడగల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు దిగింది. అదే సమయంలో అక్కడికి బైక్ పై ఓ యుకుడు వచ్చాడు. ఊర్లోకి తీసుకెళ్తానని నమ్మించిన ఆమెను బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు.

కొంత దూరం వెళ్లాక ఆ వృద్ధురాలి మెడలోని తులంన్నర బంగారం గొలుసును లాక్కొని పరారయ్యాడు. దీంతో రోడ్ పై ఏడుస్తున్న గంగును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

గతంలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని బెదిరించి ఖరీదైన సెల్‌ఫోన్, ఉంగరాలు, ఏటీఎం కార్డులను లాక్కొన్నారు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Also Read : బాలుడిపై ఏడాదిగా ముగ్గురు బాలల లైంగిక దాడి