Theft Case : దారుణం-దొంగతనం నెపంతో మహిళలను నగ్నంగా ఉంచి వాతలు పెట్టిన ప్రబుధ్దుడు

మహిళా దినోత్సవం రోజు కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  దొంగతనం నెపంతో  ఇద్దరు మహిళలను  ఒకవ్యక్తి దారుణంగా హింసించాడు. 

Chandarlapadu Police Station

Theft Case :  మహిళా దినోత్సవం రోజు కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  దొంగతనం నెపంతో  ఇద్దరు మహిళలను  ఒకవ్యక్తి దారుణంగా హింసించాడు.  చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో రోల్డ్ గోల్డ్ నగలు వీధి వీధికి తిరిగి అమ్ముకుంటున్నారు ఇద్దరు మహిళలు.  సాయంత్రానికి  తిరిగి తమ ఇంటికి నందిగామ  వెళ్తుండగా ఒక ఇంటి యజమాని  వారిని అడ్డుకున్నాడు.

తమ ఇంట్లో బంగారం పోయిందని.. అది మీరే దొంగిలించారని చెప్పి వారిని ఇంట్లోకి   తీసుకు వెళ్లి దారుణంగా బట్టలు ఊడదీసి కొట్టాడు. వాతలు పెట్టాడు.  ఇంతలో  ఇంట్లోనే బంగారం దొరకటంతో పొరపాటు అయ్యిందని చెప్పి దగ్గరుండి వారిని ఆటో ఎక్కించి పంపించాడు.
Also Read : Mahesh Babu : సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్..
పంపేటప్పుడు మీ భర్తలకు జరిగిన  విషయం చెపితే మీ ప్రాణాలు తీస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఆ ఇద్దరు మహిళలు చందర్లపాడు  చేరుకుని అక్కడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.