smoking hookah
Smoking hookah: పోలీస్ స్టేషన్ బయటే హుక్కా తాగుతూ వీడియో తీసుకున్నాడు ఓ యువకుడు. అంతేగాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలోని హఫీజ్ పూర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసి ఫేమస్ అయిపోదామని భావించిన ఆ యువకుడు హుక్కాను తీసుకుని పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి వచ్చాడు. పోలీస్ స్టేషన్ బయటే కూర్చొని హుక్కా పీల్చాడు. ఆ సమయంలో అతడి స్నేహితుడు వీడియో తీశాడు. అనంతరం ఇంటికి వెళ్లి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది ఉత్తరప్రదేశ్ లో బాగా వైరల్ కావడంతో కలకలం రేపింది.
పోలీస్ స్టేషన్ వద్ద ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంటని తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు ఆ యువకుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ యువకుడికి పోలీస్ స్టేషన్ల వద్ద వీడియోలు తీసుకోవడం అంటే ఇష్టమని అందుకు ఇలా చేశాడని గుర్తించారు. ఆ యువకుడు పోలీస్ స్టేషన్ వద్దకు హుక్కా తీసుకు వచ్చిన విషయాన్ని తాము గుర్తించలేదని హఫీజ్ పూర్ పోలీసులు తెలిపారు.
Shahrukh Khan : ఎట్టకేలకు బాయ్‌కాట్ పై స్పందించిన షారుఖ్.. సినిమాలని సీరియస్ గా తీసుకోకండి..