Extra Marital Affair Murder : ఫ్రెండ్ ప్రియురాలిపై మోజు….అక్రమ సంబంధంతో స్నేహితుడి హత్య…!

వివాహేతర సంబంధం...ఇది అనైతికమని తెలిసినా మగవాళ్లు, ఆడవాళ్లు ఈబంధం కోసం వెంపర్లాడూతూనే ఉంటారు.

  • Updated on- September 15, 2021 / 05:01 PM IST

Illegal Affair Murder

Extra Marital Affair Murder : వివాహేతర సంబంధం…ఇది అనైతికమని తెలిసినా మగవాళ్లు, ఆడవాళ్లు ఈబంధం కోసం వెంపర్లాడూతూనే ఉంటారు. వీటి మూలంగా కాపురాలు కూలిపోయి, నేరాలు జరుగుతున్నాయని తెలిసినా సమాజంలో ఇవి మాత్రం ఆగటం లేదు. స్నేహితుడి ప్రియురాలిపై కన్నేసిన వ్యక్తి, ఆమెపై మోజు పడ్డాడు. ఆమెను లోబరుచుకుని స్నేహితుడ్ని హతమార్చాడు. తాగిన మైకంలో, అహంకారంతో నిజం కక్కేశాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా కిథోర్ పట్టణంలో నసీమ్ అనే వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడుగా పని చేసేవాడు. అతను హీనా అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. వారిద్దరూ గురుముక్తేశ్వర్ అనే ప్రాంతంలో ఇల్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. తరచూ వారింటికి వచ్చే అతని స్నేహితుజు డానిష్, హీనా పై కన్నేశాడు. క్రమంగా ఆమెతో మాటలు కలిపి ఆమెను లోబరుచుకున్నాడు. స్నేహితుడికి తెలియకుండా అతని ఇంటికి వెళ్లి హీనా తో సన్నిహితంగా ఉండసాగాడు.
Also Read : Men Molested Girl : నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేసిన శాడిస్టులు అరెస్ట్
కొన్నాళ్లకు ఈవిషయం నసీమ్ పసిగట్టాడు. ఈవిషయమై మిత్రుడు డానిష్ ను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోమని కోరాడు. అయినా డానిష్ తన పద్ధతి మార్చుకోలేదు. ఈ క్రమంలో మార్చి16 నుంచి నసీమ్ కనపడకుండా పోయాడు. నసీమ్ కుటుంబం మార్చి 23న  కిథోర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ  నసీమ్  ఆచూకి లభించలేదు.

కాగా… హీనా విషయంలో మందలించిన స్నేహితుడు నసీమ్ ను, డానిష్ మార్చి 16న హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని అమ్రోహ్ లోని కాలువలో పడేశాడు. కొన్నాళ్లకు మృతదేహం  ధనోరమండి ప్రాంతంలో కాలువలో పోలీసులు కనుగొన్నారు. మృతదేహాం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోవటంతో… గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు ఖననం చేశారు.
Also Read : Saidabad Rape : చౌటుప్పల్ దగ్గర కనిపించిన రేపిస్ట్ రాజు
అనంతరం డానిష్, హీనా కలిసి జీవించసాగారు. కొన్నాళ్లకు వాళ్లిదరూ పెళ్లి చేసుకుని గురుముక్తేశ్వర్ లోనే కాపురం పెట్టారు. డానిష్ కు అతిగా మద్యం సేవించే అలవాటు ఉంది. ఈక్రమంలో అతను ఒకరోజు   పొరుగున ఉండే షబ్నమ్ అనే మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవలో డానిష్ షబ్నమ్‌ను బెదిరించాడు. నసీమ్‌ను చంపినట్లుగానే   నీకొడుకును చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు.

ఆ వాగ్వాదంలోనే  తనకు మర్డర్లు చేయటం పెద్ద విషయం కాదని…ఇప్పటి వరకు 16 హత్యలు చేశానని ఆవేశంలో చెప్పుకొచ్చాడు. వెంటనే ఈవిషయాన్ని షబ్నమ్ నసీమ్ కుటుంబ సభ్యులకు చేరవేసింది. వారు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు డానిష్, హీనాలను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.