Saidabad Rape : చౌటుప్పల్ దగ్గర కనిపించిన రేపిస్ట్ రాజు

సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్ గేట్ దగ్గర సీపీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Saidabad Rape : చౌటుప్పల్ దగ్గర కనిపించిన రేపిస్ట్ రాజు

Raju

Saidabad child rape and murder : హైదరాబాద్ సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు.. చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్ గేట్ దగ్గర సీపీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వెళ్లేలోగానే రాజు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం అందుతోంది. నిందితుడు రాజు కోసం పోలీసులు 6 రోజులుగా గాలిస్తున్నారు. రాజు కోసం డెబ్బై రెండు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాజు కోసం.. ఆరు రోజులుగా వివిధ పోలీసు బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం నల్గొండ జిల్లా మోత్కూరు సమీపంలోని పంతంగి టోల్ గేట్ నుండి టువార్డ్స్ నార్కట్ పల్లి వైపు అనుమానితుడుగా వెళ్తున్న రాజును గమనించిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.

Saidabad Rape : సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష

సమాచారం అందుకున్న పోలీసులు పంతంగి నుంచి టువార్డ్స్ నార్కట్ పల్లివైపు వెంటనే ఒక పోలీస్ టీమ్ వెళ్లింది. పరిసర ప్రాంతంలో ఒక పోలీసు బృందం పరిశీలించింది. అక్కడి నుంచి నిందితుడు రాజు తప్పించుకున్నట్లుగా పోలీసుల ద్వారా సమాచారం అందుతోంది. రాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డెబ్బై పోలీసు బృందాలు దాదాపు వెయ్యి మంది పోలీసులు ఈ కేసుపైనే ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణ త్యకు గురైన విషయం విషయం తెలిసిందే. నిందితుడు రాజు.. చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి బాలిక కనిపించలేదు. ఎంత వెతికినా కుటుంబసభ్యులకు కనిపించలేదు. అయితే పాప ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు.

Saidabad Girl Rape Case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి పై రూ.10లక్షలు నజరానా

కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో చిన్నారి కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.

ఘటన జరిగిన రోజు నుంచి నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పోలీసులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా నిందితుడి ఆచూకీ లభించలేదు. పరారీలో ఉన్న నిందితుడు రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడిని పట్టిచ్చిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ప్రకటించారు.