Saidabad Girl Rape Case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి పై రూ.10లక్షలు నజరానా

హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి పరారీలోఉన్న నిందితుడు రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు రివార్డు ప్రకటించారు.

Saidabad Girl Rape Case : సైదాబాద్ రేప్ కేసు నిందితుడి పై రూ.10లక్షలు నజరానా

Saidabad Rape Case Accsed

Updated On : September 15, 2021 / 2:30 PM IST

Saidabad Girl Rape Case : హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి పరారీలోఉన్న నిందితుడు రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు రివార్డు ప్రకటించారు. ఘటన జరిగిన రోజు నుంచి నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పోలీసు శాఖ 10 బృందాలను ఏర్పాటు చేసి రాజుకోసం గాలిస్తోంది. అయినా నిందితుడి ఆచూకీ లభించలేదు.

నిందితుడిని పట్టిచ్చిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ప్రకటించారు. నిందితుడి ఆచూకి తెలిసినవారు ఈఫోన్ నెంబర్లకు– 9490616366,– 9490616627 సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వీటితో పాటు నిందితుడి గురించి కొంత సమాచారాన్ని ఇచ్చారు.

నిందితుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు
ఎత్తు 5″9
పొడువాటి జుట్టును రబ్బరు బ్యాండుతో ముడి వేస్తాడు.
నిందితుడు టోపీ ధరించి మెడలో ఎర్ర కండువా ధరించి ఉన్నాడు.
రెండు చేతులపై మౌనిక అని టాటూ వేయించుకున్నాడు.
గడ్డం పూర్తిగా పెరిగిలేదు, గవదల వద్ద మాత్రమే కాస్త పెరిగి ఉంటుంది.
క్యాజువల్ ప్యాంటు, షర్ట్ ధరించి ఉంటాడు.
నిందితుడు మద్యం సేవిస్తాడని పోలీసులు కొంత సమాచారం ఇచ్చారు.
నిందితుడి సమాచారం ఇచ్చినవారి వివరాలుకూడా గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.