Gas Heater Death : రాత్రంతా అలాగే వదిలేయడంతో తెల్లారేసరికి ఘోరం.. భార్యభర్తలు దుర్మరణం

Gas Heater Death : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబల్ జిల్లాలో గ్యాస్ హీటర్ ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. రాత్రంతా గ్యాస్ హీటర్ ఆన్ లో ఉండటం వల్ల ఊపిరాడక దంపతులు మృతి చెందారు. అల్ సలామ్(25), మెషర్ జహాన్(23) దంపతులు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. శుక్రవారం రాత్రి పడుకున్న దంపతులు ఉదయం 10 గంటల వరకు నిద్రలేవ లేదు. దీంతో చుట్టపక్కల వారికి అనుమానం వచ్చింది. వెంటనే వారు సలామ్ బంధువులకు సమాచారం ఇచ్చారు. సలామ్ బంధువులు వెంటనే అక్కడికి వచ్చారు. తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా షాక్ తిన్నారు. సలామ్ అతడి భార్య చలనం లేకుండా కనిపించారు.

Also Read..Drunk Woman Ruckus : హవ్వ..! నడిరోడ్డుపై ప్యాంటు విప్పేసిన మహిళ.. మద్యం మత్తులో రచ్చ రచ్చ.. వీడియో వైరల్

దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే వారు చనిపోయారని గుర్తించారు. 4 నెలల చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. లోనికి వెళ్లి చూడగా గ్యాస్ హీటర్ పూర్తిగా కాలిపోయి కనిపించింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, భార్యభర్తలు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాత్రంతా గ్యాస్ హీటర్ ఆన్ లో ఉంచడంతో.. ఊపిరాడక దంపతులు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

గ్యాస్ హీటర్ కారణంగా ఊపిరాడక వారిద్దరూ మరణించినట్లు పోలీసులు తేల్చారు. కాగా, గ్యాస్ హీటర్ రాత్రంతా ఆన్ లో ఉంచడం పలు సందర్భాల్లో ప్రమాదాలకు దారితీస్తోంది. ఊపిరాడక చనిపోతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

Also Read..Video Of Naked Foreigner : బాబోయ్.. దుస్తులు విప్పేసి పచ్చి బూతులు తిడుతూ సిబ్బందిపై దాడి.. ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళ రచ్చ రచ్చ

వాస్తవానికి గ్యాస్ హీటర్లు సురక్షితమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే, సర్వీస్ చేయనివి, సరిగ్గా ఇన్ స్టాల్ చేయని గ్యాస్ హీటర్లు చాలా ప్రమాదం అని, గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ గదిలోకి స్వచ్చమైన గాలి రాకుండా మొత్తం మూసేసి ఉంటే.. గాలిలో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు స్థాయిలను పెంచుతుందని, ఇది మరణానికి దారితీస్తుందని హెచ్చరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.