Girl Raped : బస్సులో బాలికపై అత్యాచారం.. యూపీలో దారుణం
మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ల
- Naveen
- Published On : September 22, 2021 / 05:43 PM IST
Girl Raped
Girl Raped : ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
RTC, Electricity Charges : కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణాలకు అంతులేకుండా పోయింది. స్లీపర్ బస్ లో బాలికపై అత్యాచారం జరిగింది. 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబసభ్యులతో బదర్‌పుర్ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగినప్పుడు.. ఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందకు దిగారు.
Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్
ఆ సమయంలో కండక్టర్ బబ్లూ సహచరుడు అషు.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘోరాన్ని ఆమె తన తల్లికి వివరించింది. బస్సును ఆపేందుకు తల్లి ప్రయత్నించగా బబ్లూ ఆమెను లాగి పడేశాడు. అనంతరం బబ్లూ, అషు బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై శిఖోహాబాద్ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అషును అరెస్టు చేశారు.
