asaduddin owaisi
Vande Bharat Express Owaisi : ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బోగీపై రాళ్లు రుతవ్వడంతో ఆ బోగీలోని అద్దాలు పగిలాయి.
ఈ విషయాన్ని ఆ పార్టీ నేతత వారిస్ పఠాన్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్‌లో ఆయన పోస్టు చేశారు. సూరత్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
MP Asaduddin Owaisi : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన దుండగుడు అరెస్టు
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై గురువారం (ఫిబ్రవరి 3,2020)న కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. యూపీలోని మీరట్ లో అసదుద్దీన్ ఓవైసీపై కారులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు.
యూపీలో ఎంఐఎం కూడా పోటీ చేయనున్న క్రమంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా టోల్ ప్లాజా దగ్గర అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. కారు డోర్ లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తరువాత మరో వాహనంలో ఢిల్లీ సురక్షితంగా చేరుకున్నారు.