Viral Video: ఆస్తి కొట్టేయడానికి.. కారులో విగతజీవి నుంచి వేలి ముద్రలు తీసుకున్న కుటుంబ సభ్యులు

విగతజీవిగా పడి ఉన్న వృద్ధురాలి వేలి ముద్రలను తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోపై పోలీసులు స్పందించారు.

Uttar Pradesh

Viral Video: ఓ వృద్ధురాలు కారులో విగతజీవిగా పడి ఉంది. ఆ వృద్ధురాలి మృతదేహం వద్దకు కొన్ని పత్రాలు తీసుకువచ్చిన ఆమె బంధువులు, లాయర్ వాటిపై వేలముద్రలు తీసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

విగతజీవిగా పడి ఉన్న వృద్ధురాలి వేలి ముద్రలను తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. ఈ వీడియోను 2021 మే 8న తీశారని వివరించారు. ఆ వృద్ధురాలి వేదిముద్రలు తీసుకున్న వారిపై ఆమె మనవడు జితేంద్ర శర్మ ఇప్పటికే ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ వృద్ధురాలి పేరు కమలాదేవి అని, ఆమె భర్త కూడా గతంలోనే మృతి చెందాడని జితేంద్ర శర్మ చెప్పాడు.

వారికి పిల్లలు లేరని అన్నాడు. తన తల్లికి ఆ వృద్ధురాలు బంధువని వివరించాడు. ఆ వృద్ధురాలు చనిపోగానే ఆమె బావ కుమారులు మృతదేహాన్ని కారులో ఎక్కించుకున్నారని, ఏమైందని అడిగిన వారికి ఆగ్రా ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారని శర్మ తెలిపాడు. ఓ ప్రాంతంలో కారుని ఆపి మృతదేహం నుంచి వేలిముద్రలు తీసుకున్నారని చెప్పాడు.

ఆమె ముందే తన ఆస్తులకు సంబంధించిన వీలునామా రాసినట్లు నిందితులు చిత్రీకరించాలనుకున్నారని వివరించాడు. ఆ వృద్ధురాలికి ఓ ఇల్లు, దుకాణం ఉన్నాయని చెప్పాడు. ఆ వృద్ధురాలు సంతకం చేయగలదని, అయితే, వేలి ముద్ర ఎందుకు చేసిందని అనంతరం తమ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చిందని వివరించాడు. చివరకు తమ అనుమానమే నిజమైందని చెప్పాడు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Cow Urine: గోమూత్రం మనుషులకు హానికరం.. ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి