Andhra pradesh : విశాఖలో కిడ్నాప్ కలకలం.. ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్..?!
విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం.
- nagamani
- Published On : June 15, 2023 / 12:50 PM IST
Mp mvv satyanarayana wife, son kidnap
Mp mvv satyanarayana wife, son kidnap : విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు.. విశాఖ ఎంపీ ఎవీవీ సత్యనారాయణ కుమారుడు, అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం. ఈ కిడ్నాప్ ఘటనలకు సీరియస్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలు కిడ్నాప్ అయ్యారనే వార్త సంచలనం రేపుతోంది. గురువారం ఉదయం రిషికొండలోని ఎంపీ ఎంవీవీ నివాసంలో చొరబడిన దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది.
కాగా, ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్‌లో జరిగిన గొడవల వల్ల ఈ కిడ్నాప్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో కలకలం రేపుతున్న ఈ కిడ్నాప్‌ల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
