స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

  • Publish Date - December 7, 2019 / 05:14 AM IST

వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని అక్షితా అనే మూడు సంవత్సరాల చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుంటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో జరిగింది.

వివరాలు.. శనివారం (డిసెంబర్ 7, 2019) ఉదయం రాయపర్తి గ్రామంలో యస్.వి. స్కూల్ బస్సు కిందపడి అక్కడిక్కడే చనిపోయింది. ఈ చిన్నారి తన తల్లితో కలిసి తన సోదరిని స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళ్లింది. అయితే సోదరిని బస్సు ఎక్కించి వస్తుండగా.. రోడ్డు దాటుతున్న చిన్నారి బస్సు వెనుక టైర్‌ కింద పడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది.  

దీంతో వెంటనే బంధువులు, గామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ బస్సును అడ్డుకొని డ్రైవర్ ను చితకబాదారు.