Wife Suicide: భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..ఆత్మహత్య చేసుకున్న భార్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త..అడిగిన వెంటనే తనను సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
- Bharath Reddy
- Published On : May 6, 2022 / 07:17 AM IST
Shankar
Wife Suicide: దంపతుల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి మనస్పర్థలు చివరకు ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఆకారణమైన విషయాలకే మనసు పాడు చేసుకుని నిండు జీవితనాన్ని బలి తీసుకుంటున్నారు కొందరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త..అడిగిన వెంటనే తనను సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గురువారం చోటుచేసుకుంది. శంకరపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వికారాబాద్ జిల్లా సంగెం గ్రామానికి చెందిన రాజు, స్వాతిలు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరిలో వివాహం జరగ్గా..కొన్ని రోజుల అనంతరం పెద్దలను ఒప్పించి వేరు కాపురం పెట్టారు. ఈక్రమంలో రాజు శంకరపల్లిలో ఓ హోటల్ లో పనికి కుదరగా..రెండు నెలల క్రితం స్థానిక భవానినగర్ లో గది అద్దెకు తీసుకుని స్వాతిని కూడా తీసుకువచ్చాడు.
Also read:Telangana Covid Cases Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే..
అయితే బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు వెళదామని స్వాతి అడగ్గా..అందుకు నిరాకరించిన రాజు..మరుసటి రోజు వెళదామని బదులిచ్చాడు. దీంతో ఈ విషయంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా మనస్తాపానికి గురైన స్వాతి..గురువారం రాజు ఇంటిలో లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై తమకు సమాచారం అందడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు శంకరపల్లి ఎస్ఐ సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు.
