ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు అపూర్వ తివారీని పోలీసులు అరెస్టు చేశారు. తివారీ కుమారుడు, రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో అపూర్వ తివారీని బుధవారం (ఏప్రిల్ 24,2019) అరెస్ట్ చేశారు. శేఖర్ తివారీ (40) ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. ముందు సహజ మరణం అని అంతా అనుకున్నారు. పోస్టుమార్టమ్ నివేదికలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : అఖిలేష్ కౌంటర్ : సీఎం యోగికి ల్యాప్ టాప్ ఇస్తే.. 2 రోజులు వృథా
శేఖర్ ది సహజ మరణం కాదని, దిండును ముఖంపై నొక్కిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆస్తి కోసం భార్య అపూర్వ భర్త రోహిత్ ను మర్డర్ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ ను భార్య అపూర్వ చంపిందని రోహిత్ తల్లి ఉజ్వల తివారీ ఆరోపించారు.
రోహిత్ తివారీ ఏప్రిల్ 16న చనిపోయారు. కేసు విచారణను చేపట్టిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు.. ఢిల్లీలోని రోహిత్ ఇంటిని పరిశీలించి, కుటుంబసభ్యులను ప్రశ్నించారు. ఆ సమయంలో రోహిత్ భార్య అపూర్వ అందుబాటులో లేరు. ఏప్రిల్ 12న రోహిత్ ఓటేసేందుకు ఉత్తరాఖండ్ వెళ్లారని, 15న రాత్రి తాగిన మత్తులో ఇంటికొచ్చారని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు.
Also Read : సెల్‌ఫోన్లు కొంటానంటూ కొట్టేస్తున్న కిలాడి లేడి!