కర్ణాటకలోని రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం అయింది. ఆమె శరీరం దహనమైంది. ఈ ఘటన ఏప్రిల్ 16న చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు.
మరోవైపు ఆత్మహత్య చేసుకున్నట్లుగా విద్యార్థిని సూసైడ్ నోట్ లో తెలిపింది. ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. కానీ ఆమె కుటుంబీకులు మాత్రం ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
హత్యగా ఫిర్యాదు స్వీకరించామని రాయిచూర్ ఎస్ పీ కిషోర్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని నెటిజన్స్ ట్వీట్ చేశారు. ఆమె అత్యాచారానికి గురైందని ఆరోపిస్తున్నారు.