Assam: భర్తను అత్తను చంపేసి.. మృతదేహాల్ని ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ
నూన్మతి ప్రాంతానికి చెందిన దుర్మార్గం ఇది. నిందితురాలి పేరు వందన కలిత. ఆమెకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉంది. అతడి సాయంతోనే ఇదంతా చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. "వందనాను తీసుకుని అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులోని చిరపుంజిలో సంఘటన స్థలానికి మా పోలీసు బృందం చేరుకుంది
- tony bekkal
- Published On : February 20, 2023 / 07:14 PM IST
Woman Kills Husband, Mother-In-Law, Hides Body Parts In Fridge
Assam: శ్రాద్ధ అనే యువతిని ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తే అతి దారుణంగా హతమార్చి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది జరిగిన అనంతరం ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక తాజాగా నిక్కీ యాదవ్ కేసు సైతం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనల్లో మహిళలే కాదు, పురుషులు కూడా బాధితులు అవుతున్నారు. తాజాగా అస్సాంకు చెందిన ఒక మహిళ.. తన భర్తను అత్తను హతమార్చి వారిద్దరి మృతదేహాల్ని ఫ్రిజ్‌లో దాచింది. అనంతరం కొద్ది రోజులకు శరీరపు ముక్కల్ని మేఘాలయ సరిహద్దులో ఉన్న చిరపుంజిలో పడేసింది.
Bihar: నితీశ్ కుమార్కు షాకిచ్చిన కూష్వాహా.. జేడీయూ నుంచి ఔట్, వెంటనే కొత్త పార్టీ ప్రకటన
అస్సాంలోని నూన్మతి ప్రాంతానికి చెందిన దుర్మార్గం ఇది. నిందితురాలి పేరు వందన కలిత. ఆమెకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉంది. అతడి సాయంతోనే ఇదంతా చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. “వందనాను తీసుకుని అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులోని చిరపుంజిలో సంఘటన స్థలానికి మా పోలీసు బృందం చేరుకుంది. ప్రేమికుడీ సహాయంతో ఆమె హతమార్చిన భర్త, అత్త శరీర భాగాలను పడేసిన ప్రాంతాన్ని చూపించింది” అని ఒక పోలీసు అధికారి తెలిపారు. వందన ముందుగా ఇద్దరినీ హతమార్చి, వారి శరీర భాగాల్ని ముక్కలుగా కోసింది. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో భద్రపరిచిందని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు.
