Bihar: నితీశ్ కుమార్‭కు షాకిచ్చిన కూష్వాహా.. జేడీయూ నుంచి ఔట్, వెంటనే కొత్త పార్టీ ప్రకటన

గతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‭కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుంచి కూష్వాహా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

Bihar: నితీశ్ కుమార్‭కు షాకిచ్చిన కూష్వాహా.. జేడీయూ నుంచి ఔట్, వెంటనే కొత్త పార్టీ ప్రకటన

Upendra Kushwaha launches new party Rashtriya Lok Janata Dal

Bihar: దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనే ప్రణాళికలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి, జనతాదశ్ యూనైటెడ్ పార్టీ అధినేత నితీశ్ కుమార్‭కు సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహా పార్టీని వీడారు. పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. తొందరలోనే పార్టీ నుంచి వెళ్లిపోతారని కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్లుగా సోమవారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా వెంటనే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించేశారు.

Hindenburg Effect: పతనంలోనూ అదానీ రికార్డ్.. ఒక్క రిపోర్టుతో $120 బిలియన్ల నుంచి ఏకంగా $49 బిలియన్లకు వచ్చిన సంపద

రాజీనామా అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కుష్వాహా మాట్లాడుతూ ”ఈరోజు నుంచి రాజకీయంలో కొత్త ప్రస్థానం ప్రారంభిస్తున్నాను. కొద్ది మంది మినహా జేడీయూలోని ప్రతి ఒక్కరూ ఆందోళనగానే ఉన్నారు. ఎన్నికైన నా సహచర మిత్రులతో సంప్రదించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. మొదట్నో నితీష్ చాలా మంచిగా ఉండేవారు. కానీ చివరి వరకు వచ్చే సరికి ఆయన ఎంచుకున్న మార్గం ఆయనకే కాకుండా బీహార్‌‌కు కూడా చేటు చేయనుందని తెలుస్తోంది” అని అన్నారు. ఇక తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరు అప్పుడే ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ పేర్లు కలిసేలా ‘రాష్ట్రీయ లోక్ జనతా దళ్’ అని నామకరణం చేశారు. తన మద్దతుదారులంతా కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడిగా ఉంటానని, కర్పూరి ఠాకూర్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.

CM Jagan: ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్

గతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‭కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుంచి కూష్వాహా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి అప్పట్లోనే కూష్వాహాకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది, కూష్వాహా కూడా అదే ఆశతో ఉన్నారు. కానీ అది భంగం కావడంతో అసంతృప్తే మిగిలింది. దీనికి తోడు మరికొద్ది రోజుల్లో తేజస్వీని ముఖ్యమంత్రి చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తుండడంతో అది మరింత ఎక్కువైందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Meghalaya: ప్రధాని మోదీకి షాకిచ్చిన సీఎం.. ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరణ

వీటికి తోడు, ఇటీవల ఢిల్లీలో వైద్యపరీక్షలకు వెళ్లిన కుష్వాహ కొందరి బీజేపీ నేతలతో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఇది కుష్వాహ ఆదేశాలతో ఆయన వర్గీయులు చేసిన పనేనని నితీశ్ అనుమానించడంతో విభేదాలు మరింత ముదిరాయి. ఈ విషయమై నితీశ్ కొన్ని హెచ్చరికలు చేశారు. పార్టీ కట్టుబాట్లను పాటించే విషయంలో ఎవరూ అతీతులు కాదని, తమ పార్టీ ఇచ్చిన గౌరవం ఏ పార్టీ ఇవ్వదని పరోక్షంగా కుష్వాహను ఉద్దేశించే నితీశ్ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీనికి తోడు తనను పార్టీ సమావేశాలకు పిలవడం లేదంటూ కుష్వాహ బహిరంగంగా చెప్పారు. ఈ క్రమంలోనే జేడీయూకు రాజీనామా చేయడంతో పాటు సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు కుష్వాహ ప్రకటించేశారు.