Hindenburg Effect: పతనంలోనూ అదానీ రికార్డ్.. ఒక్క రిపోర్టుతో $120 బిలియన్ల నుంచి ఏకంగా $49 బిలియన్లకు వచ్చిన సంపద

ఒకానొక సమయంలో ప్రపంచంలో రెండవ స్థానానికి వెళ్లిన గౌతమ్ అదానీ, ప్రస్తుతం టాప్-100 జాబితాలో కూడా లేరు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ విడుదల చేసిన తాజా ఇండెక్స్‌లో 500 మంది ధనవంతులలో అదానీకి చోటు దక్కిందంటే, ఆయన సంపద ఎంతలా కరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు

Hindenburg Effect: పతనంలోనూ అదానీ రికార్డ్.. ఒక్క రిపోర్టుతో $120 బిలియన్ల నుంచి ఏకంగా $49 బిలియన్లకు వచ్చిన సంపద

Gautam Adani’s net worth drops below $50 billion

Hindenburg Effect: అతి తక్కువ కాలంలో బిలియన్ డాలర్లు సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన భారత కుబేరుడు గౌతమ్ అదానీ, పతనంలో అంతకు మించిన రికార్డును నమోదు చేశారు. అమెరికా సర్వే సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క రిపోర్టుతో ఆయన సంపద గాలి మేడలా కూలిపోయింది. ఒక్క నెల క్రితం అదానీ సంపద 120 బిలియన్ డాలర్లు కాగా, ఒక్క రిపోర్టుతో అది 50 బిలియన్ డాలర్ల కంటే కిందకు పడిపోయింది. ప్రస్తుతం అదానీ సంపద 49.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 50 బిలియన్ డాలర్లు. దీంతో దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి అవతరించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాల విడుదల.. అధికార పార్టీ అభ్యర్థులు వీరే

సుమారు 71 బిలియన్ డాలర్ల సంపద గాలి బుడగలా మాయమైంది. హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టు అనంతరం భారతీయ స్టాక్ మార్కెట్ ప్రకంపనలు సృష్టించింది. అదానీ గ్రూప్‭లో ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్‌ను పాతాళానికి నెట్టింది. ఏడు ప్రధాన కంపెనీలు సంయుక్తంగా 120 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉండేవి. దాదాపుగా 60 శాతాని కంటే ఎక్కువగా ఇవి పతనమయ్యాయి. హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టున అదానీ గ్రూప్ తోసిపుచ్చినప్పటికీ పతనం మాత్రం ఆగడం లేదు. చివరికి హిండెన్‌బర్గ్ మీద అదానీ న్యాయపోరాటానికి దిగినప్పటికీ, ఆయన వ్యక్తిగత సంపద మాత్రం రోజు రోజుకు తగ్గుతూనే ఉంది.

MLC Kavita : బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ…ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్

ఒకానొక సమయంలో ప్రపంచంలో రెండవ స్థానానికి వెళ్లిన గౌతమ్ అదానీ, ప్రస్తుతం టాప్-100 జాబితాలో కూడా లేరు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ విడుదల చేసిన తాజా ఇండెక్స్‌లో 500 మంది ధనవంతులలో అదానీకి చోటు దక్కిందంటే, ఆయన సంపద ఎంతలా కరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక 83.6 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఈ ఇండెక్స్‌లో ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా సైతం అంబానీయే కొనసాగుతున్నారు.